ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య
భార్యపై అనుమానంతో భర్త ఉరేసుకున్న ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. గోరంట్ల మండలం పాలసముద్రానికి చెందిన నరసింహమూర్తి, సుగుణమ్మకు కొన్నేళ్ల క్రితం పెళ్లి కాగా వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా భార్య తరచూ ఫోన్ మాట్లాడటంపై భర్త నరసింహమూర్తి మందలించే వారు. ఈ క్రమంలో బుధవారం ఇంటి నుంచి వెళ్లిన భార్య రాత్రి వరకు తిరిగి రాలేదు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన నరసింహ ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.