TG: అమెరికాలో జరిగిన కాల్పుల్లో తెలుగు విద్యార్థి మృతి చెందారు. మృతుడిని తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కేశంపేటకు చెందిన ప్రవీణ్ (27)గా గుర్తించారు. యూస్‌లో ప్రవీణ్ ఎంఎస్ సెకండియర్ చదువుతున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.