ప్లాస్టిక్ వినియోగిస్తున్న షాప్ యజమానికి జరిమానా

71చూసినవారు
ప్లాస్టిక్ వినియోగిస్తున్న షాప్ యజమానికి జరిమానా
గుత్తి మున్సిపాలిటీ పరిధిలో దుకాణదారులు ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా షాపు యజమానులకు హెచ్చరించారు. గురువారం ఆయన పలు దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్ వద్ద దుకాణాలను తనిఖీ చేశారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఒక దుకాణాన్నికి రూ.15000 జరిమానా విధిస్తూ షాపును సీజ్ చేశారు. ప్లాస్టిక్ వినియోగిస్తే చర్యలు తప్పవన్నారు.

సంబంధిత పోస్ట్