పామిడి పట్టణంలోని వాసవీ కళ్యాణ మండపంలో మంగళవారం నిర్వహించే ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని లయన్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రభుత్వ ఆయూష్ సీనియర్ వైద్యాధికారి నల్లపాటి తిరుపతినాయుడు ఆదివారం తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ శిబిరం నిర్వహిస్తామన్నారు. శిబిరానికి వచ్చేవారు ఆధార్ కార్డు జిరాక్స్ తో పాటు రెండు పాస్ ఫోటోలు తెచ్చుకోవాలన్నారు.