వాతావరణ వైపరీత్యాల వల్ల ప్రభావితమైన దేశాలకు మద్దతుగా నిలిచేందుకు ఏర్పాటు చేసిన 'గ్లోబల్ క్లైమేట్ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్' తొలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఇబ్రహీమా చీక్ డియోంగ్ నియమితులయ్యారు. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్ వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ ఛేంజ్ కింద 2022లో ఈ ఫండ్‌ను ఏర్పాటు చేశారు. నవంబరు 1, 2024 నుంచి నాలుగేళ్ల పాటు ఈ తొలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవిలో కొనసాగుతారు.