Nov 08, 2024, 02:11 IST/
మెయిన్స్ అభ్యర్థులకు రూ.లక్ష సాయం: డిప్యూటీ సీఎం భట్టి
Nov 08, 2024, 02:11 IST
తెలంగాణ నుంచి సివిల్స్ మెయిన్స్ కోసం ఎంపికైన అభ్యర్థులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల నగదు సాయం అందిచనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. అయితే గతంలో సివిల్స్ మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థులకు ఇటీవల ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది. మరోసారి ఎవరైతే ఎంపికవుతారో వారికి రూ.లక్ష సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రం నుంచి ఎక్కువ మంది సివిల్స్ ఉద్యోగాలు సాధిస్తే.. వారి వల్ల రాష్ట్రానికే మంచి చేకూరుతుందన్నారు.