పశువులకు చర్మవ్యాధి టీకాలను తప్పనిసరిగా వేయించుకోవాలి

54చూసినవారు
పశువులకు చర్మవ్యాధి టీకాలను తప్పనిసరిగా వేయించుకోవాలి
నల్లచెరువు మండల వ్యాప్తంగా పశువులను పోషించే ప్రతి రైతు పశువులకు ముద్ద చర్మవ్యాధి టీకాలను తప్పనిసరిగా వేయించుకోవాలని మండల పశువైద్యాధికారి మల్లికార్జున తెలిపారు. ఈనెల 20 నుండి వచ్చేనెల 18 వరకు నిర్వహించే ముద్ద చర్మ వ్యాదీ నివారణ టీకాల కార్యక్రమాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధిలోని తవలంమర్రి, పంతలచెరువు తదితర గ్రామాలలో ముద్ద చర్మ వ్యాధి టీకాలు వేసే కార్యక్రమం ప్రారంభించామన్నారు.

సంబంధిత పోస్ట్