అనంతపురం: కుల వివక్ష చూపిన వారి పై చర్యలు తీసుకోవాలి

62చూసినవారు
అనంతపురం: కుల వివక్ష చూపిన వారి పై చర్యలు తీసుకోవాలి
బ్రహ్మసముద్రం మండలం పడమటి కోడిపల్లి అంగన్వాడీ దళిత చిన్నారులపై అమానుషంగా వ్యవహరించడం సరికాదని ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి మండిపడ్డారు. శనివారం అనంతపురం లోని ఐసీడీఎస్ జిల్లా కార్యాలయంలో దళిత పిల్లల పట్ల కుల వివక్షత గురిచేయడాన్ని నిరసిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. అంగన్వాడీ కేంద్రంలో దళిత పిల్లలను కులవివక్షతకు గురి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్