కళ్యాణదుర్గం పట్టణం కుందుర్పి రోడ్డులోని రాధాస్వామి ఆశ్రమం సమీపంలో శుక్రవారం విద్యుత్ స్తంభంపై ఉన్న ఫలంగా మంటలు చెలరేగుతున్నాయి. నిప్పురవ్వలు ఎగిసిపడటంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. విద్యుత్ వైర్లు ఒకదానికొకటి తగలడంతో మంటలు చెలరేగి ఉండవచ్చని విద్యుత్ శాఖ అధికారులు చెప్పారు. అయితే విద్యుత్ స్తంభంలో ఒక్కసారిగా మంటలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.