కళ్యాణదుర్గం పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలలో తాగునీటికి ఇబ్బందిగా ఉందని ఎమ్మార్పీఎస్ నాయకులు దురదకుంట తిమ్మరాజు సోమవారం మున్సిపల్ కమీషనర్ వంశీకృష్ణ భార్గవ్ కు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీలో ఏర్పాటు చేసిన కొళాయిలు తాగునీటి అవసరాన్ని తీర్చడం లేదన్నారు. కాలనీలో మరికొన్ని చోట్ల కొళాయిలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు చర్యలు తీసుకుంటామని కమీషనర్ హామీ ఇచ్చారు.