AP: స్కూల్, ఇంటర్మీడియట్, ఉన్నత విద్యపై మంత్రి నారా లోకేష్ అధికారులతో నేడు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులకు ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. మోడల్ ఎడ్యుకేషన్ లక్ష్యంగా సంస్కరణలు తీసుకు రావాలన్నారు. పుస్తకాల బరువు తగ్గించి నాణ్యత పెంచాలని సూచించారు. ఉన్నత విద్యలో క్యూఎస్ ర్యాంకింగ్స్ లక్ష్యంగా మార్పులు చేపట్టాలని ఆదేశించారు. కేజీ నుంచి పీజీ వరకు పాఠ్య ప్రణాళిక ప్రక్షాళనకు కసరత్తు చేయాలని స్పష్టం చేశారు.