శెట్టూరు మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ సచివాలయంలో రెండు నెలలుగా ఉద్యోగులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు గురుమూర్తి మాదిగ అన్నారు. ఈమేరకు గురువారం జిల్లా సలహాదారులు చాంద్ భాష, ఆర్డీవో వసంత్ బాబును కలిసి వినతిపత్రం అందజేశారు. చొరవ తీసుకొని సంబంధించిన అధికారులను నియమించాలని కోరారు. కార్యక్రమంలో శెట్టూరు మండల అధ్యక్షులు తిప్పేస్వామి మాదిగ తదితరులు పాల్గొన్నారు.