ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆదేశాలతో మాజీ మున్సిపల్ ఛైర్మన్ బిక్కి రామలక్ష్మి, గోవిందప్ప ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమం కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డు, 55 బూత్ లలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా సభ్యత్వ నమోదు ఉపయోగాలపై శ్రేణులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీపీ పూజారి నరేష్, డీలర్ మోహన్, టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు.