కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజన్ పరిధిలోని కణేకల్ మండలం రచ్చుమర్రి గ్రామ ఇసుక రీచు ట్రైనీ కలెక్టర్, ఇన్ చార్జి రెవెన్యూ డివిజనల్ అధికారిని వినూత్న శుక్రవారం తనిఖీ చేశారు. ఎన్ని టన్నుల ఇసుక నిల్వ ఉంది, ఇసుక కోసం ఎంతమంది దరఖాస్తులు చేసుకున్నారని, ఇసుక తరలింపు గురించి అక్కడ అధికారులతో ఆరా తీశారు. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.