Nov 25, 2024, 17:11 IST/ఎల్లారెడ్డి
ఎల్లారెడ్డి
ఎల్లారెడ్డి: శ్రీవేణుగోపాల స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు
Nov 25, 2024, 17:11 IST
కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా నాగిరెడ్డిపేట్ మండలం చీనూర్ శ్రీవేణుగోపాల స్వామి ఆలయంలో సోమవారం సామూహిక సత్యనారాయణ వ్రతాలను కన్నుల పండుగగా నిర్వహించారు. వేణుగోపాల స్వామి ఆలయంలో వేద బ్రాహ్మణోత్తములు గోపాలచారి ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన 35 మంది జంటలు పాల్గొని సత్యనారాయణ వ్రతాన్ని వేద మంత్రోచ్ఛారణాల మధ్య భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. భక్తులకు అన్నదాన ప్రసాదం వితరణ చేశారు.