నాగిరెడ్డిపేట్ మండలంలోని తాండూర్ శివారులో వెలసిన వెయ్యి ఏళ్లపై చరిత్ర గలిగిన త్రిలింగరామేశ్వర ఆలయంలో కార్తీకమాసం చివరి రోజైన 29వ తేదీ శుక్రవారం మాసశివరాత్రి రోజు 101 జంటలతో, 11 వేద పండితులచే రుద్ర హోమం నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ అధ్యక్షుడు కొమ్మ దత్తు సోమవారం తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మండలం చుట్టుపక్కల గల భక్తులు ఆలయ కమిటీ వద్ద ముందుగా పేర్లు నమోదు చేసుకోగలరని తెలిపారు.