బ్రాహ్మణపల్లి: రోడ్డు ప్రమాదం..
కుడేరు మండలం బ్రాహ్మణపల్లి జాతీయ రహదారి పై అనంతపురం వెళుతూ రహదారిలో టర్నింగ్ కావడంతో వెనుక నుండి వస్తున్న బైక్ బొలెరో వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కొడిమి గ్రామానికి చెందిన ఈడిగ అభి అనే వ్యక్తికీ గాయాలవడంతో ఘటన స్థలంలో ఉన్న వారు హుటాహుటిన 108 కు సమాచారం అందించి, అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తామని కూడేరు సి ఐ శివరాం తెలిపారు.