
మడకశిర: సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే
మడకశిర మండల పరిధిలోని మందుగుండు, పిరంగుల పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం శుభవార్త తెలపడంతో గురువారం సీఎంని కలిసి కృతజ్ఞతలు తెలిపారు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అత్యంత కరువైన ప్రాంతం మడకశిర కరువు కాటకాలకు నిలయమైన, మారుమూల ప్రాంతం, కర్నాటక సరిహద్దులో ఉన్న మడకశిరలో మందు గుండు, పిరంగుల పరిశ్రమ ఏర్పాటుకు మొదటి దశగా రూ.1500 కోట్లు పెట్టుబడికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు.