ఓబవ్వ జయంతి వేడుకల్లో పాల్గొన్న మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు

77చూసినవారు
గుడిబండ మండలం, మందలపల్లి గ్రామంలో ఆదివారం ఓబవ్వజయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మడకశిర శాసనసభ్యులు ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్సి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్రదుర్గకోట, సామంతరాజుల రాజ్యాన్ని శత్రుసైన్యం నుండి కాపాడేందుకు వీరోచిత పోరాటాన్నిచేసిన వీరవనిత ఓబవ్వ ధైర్యసాహసాలు కొనియాడదగినవని కొనియాడారు. ఓబవ్వ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకుచర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్