వర్షానికి కూలిన ఇల్లు.. తప్పిన ప్రమాదం
ముదిగుబ్బ మండలంలోని రామస్వామి తండాలో బుధవారం వర్షానికి ఇంటి పైకప్పు కూలింది. రామస్వామి తండా గ్రామానికి చెందిన చాప్లా నాయక్ కు చెందిన ఇల్లు పాతబడింది. బుధవారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి కూలిపోయింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని బాధితుడు తెలిపారు. తనను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.