AP: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. దాంతో సీఐడీ కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. వల్లభనేని వంశీ బెయిల్‌పై ఈ నెల 27వ తేదీన తీర్పు ఇవ్వనుంది. కాగా, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో బెయిల్ ఇవ్వాలంటూ సీఐడీ కోర్టును వంశీ ఆశ్రయించారు. మరోవైపు వంశీకి బెయిల్ ఇవ్వొద్దని, అతడికి బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని సీఐడీ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.