CBSE బోర్డు 12వ తరగతి అకౌంటెన్సీ పరీక్షల్లో క్యాలికులేటర్ వినియోగాన్ని అనుమతించే అంశాన్ని పరిశీలిస్తుంది. విద్యార్థులకు గణన ప్రక్రియను సులభతరం చేయడానికి, టైంని ఆదా చేయడానికి ఈ నిర్ణయం తీసుకోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం, CBSE పరీక్షల్లో క్యాలికులేటర్ అనుమతి లేదు. అయితే, విద్యార్థుల నుండి వచ్చే అభ్యర్థనల నేపథ్యంలో ఈ మార్పు చేయనున్నారు. దీనిపై త్వరలోనే CBSE తుది నిర్ణయం వెల్లడించనుంది.