ముదిగుబ్బలో గుండెపోటుతో ఆర్ అండ్ బి ఉద్యోగి మృతి
ముదిగుబ్బ సొసైటీ బ్యాంకు సమీపంలో నివాసం ఉంటున్న బాబావలి (36) బుధవారం గుండెపోటుతో మరణించారు. ఈయన కొంతకాలంగా ఆర్అండ్బి శాఖలో ఉద్యోగం చేస్తున్నారు. ద్విచక్ర వాహనంలో ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యలో గుండెపోటుకు గురయ్యాడు. వాహనంపై నుంచి కిందపడి అక్కడికక్కడే చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.