ముదిగుబ్బ: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
ముదిగుబ్బ మండల కేంద్రం సమీపంలో నాగారెడ్డి గ్రామం వద్ద జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విష్ణు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతుడు నల్లమాడ వాసిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.