పరిగి: పి.నర్సాపురం గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం
పరిగి మండలం పి. నర్సాపురం గ్రామంలో అధికారులు పౌర హక్కుల దినోత్సవం కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ హసీనా సుల్తాన, ఎస్ఐ రంగడు యాదవ్, ఎస్సీ, ఎస్టి విజిలన్స్ కమిటీ మెంబెర్ రామాంజినప్ప తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా అధికారులు మాట్లాడుతూ పౌరులు అందరూ సమాన మేనని తెలిపారు. కార్యక్రమంలో ఎస్సీ హాస్టల్ వెల్ఫేర్ సిబ్బంది, సచివాలయం సిబ్బంది, ఎస్సీ కాలనీ వాసులు పాల్గొన్నారు.