పరిగి: అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం: మంత్రి

68చూసినవారు
పరిగి: అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం: మంత్రి
రాష్ట్రంలో అభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ పేర్కొన్నారు. మంగళవారం పల్లె పండుగ- పంచాయతీ వారోత్సవాల కార్యక్రమాల్లో భాగంగా మంత్రి పరిగి మండలం బీచిగానిపల్లి పంచాయతీలో పర్యటించారు. ఈ సందర్బంగా గొల్లపల్లి, పాత్రగానిపల్లి, బీచిగానిపల్లి, వంగలపల్లి గ్రామాలలో రూ 57 లక్షలతో రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి భూమి పూజ చేశారు.

సంబంధిత పోస్ట్