శ్రీసత్యసాయి జిల్లా పరిగి చెరువుకు భారీగా వరద నీరు చేరుతోంది. బుధవారం చెరువు మరువ వద్ద మంత్రి సవితమ్మ ఆదేశాల మేరకు డిఇ లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో మరమ్మత్తు పనులు చేపట్టారు. కర్ణాటక ఎగువ నుండి పరిగి చెరువు వరద నీరు పోటెత్తింది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యి మరువ వద్ద మరమ్మత్తు పనులు జోరుగా చేయిస్తున్నారు.