దేశం గర్వించదగ్గ వ్యాపారవేత్త, టాటా గ్రూపు అధినేత రతన్ టాటా మరణ వార్త బాధాకరం అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ పేర్కొన్నారు. గురువారం రతన్ టాటా మృతి పట్ల ఆమె నివాళులర్పించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ టాటా సంస్థ ద్వారా లక్షలాది మందికి ఉపాధి కల్పించడమే కాకుండా, అంతర్జాతీయంగా భారతదేశ పరిశ్రమ రంగాన్ని కొత్త పుంతలు తొక్కించిన దార్శనికుడు రతన్ టాటా అని తెలిపారు.