స్థానిక సంస్థల ఎన్నికలలో వైసీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను, వార్డ్ మెంబర్ అభ్యర్థులు అఖండ విజయంతో గెలవడానికి ప్రతి ఒక్క కార్యకర్త, నాయకులు శక్తివంచన లేకుండా కృషి చేయాలని మంత్రి శంకర నారాయణ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని వెంకటేశ్వర కళ్యాణ మండపంలో సోమవారం సాయంత్రం
మేజర్ గ్రామ పంచాయతీ వైసిపి సర్పంచ్ మద్దతుదారుడు ఎంపీక విషయంలో ముఖ్యఅతిథిగా పాల్గొని వైయస్ఆర్ సిపి సర్పంచ్ మద్దతుదారుడు ఏ.నరసింహమూర్తి భార్య ఏ.గంగాదేవిని ఎంపిక చేసారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కార్యకర్తలు నాయకులు సమిష్టిగా కృషిచేసి సర్పంచ్ అభ్యర్థుల, వార్డు మెంబర్ల గెలుపునకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ వెంకటరత్నం, మాజీ సర్పంచులు ఈశ్వరయ్య, రమాకాంత్ రెడ్డి, జెడ్ పిటిసి అభ్యర్థికి అశోక్, మాజీ వైస్ సర్పంచ్ సాయినగర్ హనుమంతప్ప, గోవిందం సీనా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.