పుట్లూరు సీఐ సుబ్రహ్మణ్యం వీఆర్ కు బదిలీ
పుట్లూరు, యల్లనూరు మండలంలో సీఐగా విధులు నిర్వర్తిస్తున్న సుబ్రమణ్యంను అనంతపురం వీఆర్ కు బదిలీ చేస్తూ అనంతపురం రేంజ్ డీఐజీ షీమోసీ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో చిత్తూరు జిల్లా వీఆర్ ఎస్పీలో ఉన్న సత్య బాబును కేటాయిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. త్వరలోనే వారికి కేటాయించిన స్థానాలలో రిపోర్ట్ చేసుకోనున్నట్లు తెలిపారు.