కనేకల్ క్రాస్ వద్ద చిరుత కలకలం.. సిసి ఫుటేజ్ వీడియో

20516చూసినవారు
రాయదుర్గం నియోజకవర్గం కణేకల్లు క్రాస్ వద్ద చిరుత సంచారం కలకలం రేపింది. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కణేకల్లు క్రాస్ వద్ద ప్రదీప్ రెడ్డికి చెందిన దానిమ్మ తోటలో చిరుత సంచారం దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. మంగళవారం గమనించిన ప్రదీప్ రెడ్డి విషయాన్ని విలేకరులకు తెలిపారు. ఫారెస్టు అధికారుల దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్