మహిళ తలలోకి ప్రవేశించిన మెదడు తినే పురుగు

63చూసినవారు
మహిళ తలలోకి ప్రవేశించిన మెదడు తినే పురుగు
చైనాకు చెందిన ఓ మహిళ తలలోకి మెదడు తినే అమీబా చేరింది. బాలముతియా మాండ్రిల్లారిస్ అనే ప్రాణాంతక జీవి 77 ఏళ్ల వయసున్న మహిళ తలలో చేరినట్టు వైద్యులు గుర్తించారు. శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారడంతో ఆమెను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. అయితే ఆమె పరిస్థితి విషమించి మరణించింది. మహిళ ఆసుపత్రిలో సుమారు 8 రోజులు వైద్యం పొందినట్టు వైద్యులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్