వజ్రకరూరు మండలం చాబాల గ్రామ పంచాయతీ కార్యాలయంలో కనకదాసు జయంతి సందర్భంగా సోమవారం గ్రామ సర్పంచ్ మల్లెల జగదీష్ కనకదాసు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. కనకదాసు సామాజిక అసమానతలు తొలగించి సమాన సమాజం కోసం పనిచేసిన గొప్ప భక్తుడు అని చెప్పారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి చంద్రకళ, వెల్ఫేర్ అసిస్టెంట్ నరేష్, గ్రామ అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.