Mar 28, 2025, 09:03 IST/కామారెడ్డి
కామారెడ్డి
బస్వాపూర్ గ్రామంలో 9 ఇళ్లలో దొంగతనాలు
Mar 28, 2025, 09:03 IST
బిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున 9 ఇళ్లలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఒకే రోజు 9 ఇళ్లలో తాళాలు పగలగొట్టి బంగారు వస్తువులతో పాటు ఇంట్లో దాచుకున్న డబ్బులు కూడా ఎత్తుకెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు దొంగలు పడ్డ అన్ని ఇండ్లను పరిశీలించారు. క్లూస్ టీం ద్వారా వివరాలు సేకరించారు. గ్రామంలో ఉన్న సీసీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నట్లు ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు.