బెట్టింగ్ యాప్స్ కేసులో ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలని విష్ణుప్రియ వేసిన పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయడానికి, దర్యాప్తుపై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. పోలీసుల దర్యాప్తునకు సహకరించాలని విష్ణుప్రియను కోర్టు ఆదేశించింది. చట్టప్రకారం దర్యాప్తు కొనసాగించాలని పోలీసులను హెచ్చరించింది.