పుట్లూరు మండలంలో పప్పుశనగ విత్తన పంపిణీకి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోందని మండల వ్యవసాయ అధికారి కాత్యాయని పేర్కొన్నారు. శనివారం మండల పరిధిలోని శనగలగూడూరు, వెంగన్నపల్లి, దోసలేడు, కడవకల్లు, సూరేపల్లి, కోమటికుంట్ల గ్రామాలకు ఉదయం నుంచి వ్యవసాయ సిబ్బంది రిజిస్ట్రేషన్ చేశారన్నారు. శనివారం 1, 132 మంది రైతులకు 1, 573 క్వింటాళ్ల విత్తనాలను రిజిస్ట్రేషన్ చేశామన్నారు.