ఆంధ్రప్రదేశ్ లిడ్ క్యాప్ ఛైర్మన్ పిల్లి మాణిక్యాల రావును విజయవాడలో శింగణమల ఎమ్మెల్యే బండారు శ్రావణి మర్యాదపూర్వకంగా మంగళవారం కలిశారు. శింగణమల మండలం రాచేపల్లిలో ఉన్న లెదర్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించాలని ఆయన్ను కోరారు. గత కొన్నేళ్లుగా మూతపడ్డ ఈ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభిస్తే, యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయనకు వివరించినట్లు తెలిపారు.