ప్రకృతి వ్యవసాయం లాభదాయకం

67చూసినవారు
ప్రకృతి వ్యవసాయం లాభదాయకం
ఎలాంటి రసాయనాలు వాడని ప్రకృతి వ్యవసాయం రైతులకు లాభదాయకమని ఏఓ మహబూబ్ బాషా సూచించారు. గురువారం యాడికి మండలంలోని కోనుప్పల పాడు, ఓబుళాపురం గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఏఓ మాట్లాడుతూ పత్తితో పాటు అంతర పంటలను సాగు చేసి ఆదాయం పొందాలన్నారు. అంతకు మునుపు ఏఓ రైతు సేవాకేంద్రంలో రైతులతో మాట్లాడుతూ పలు సూచనలిచ్చారు.

సంబంధిత పోస్ట్