తాడిపత్రి మండలానికి చెందిన వీఆర్వో ప్రశాంత్ మృతి చెందారు. పట్టణ పరిధిలోని వడ్లపాలెం సచివాలయ గ్రేడ్-2 వీఆర్వోగా ప్రశాంత్ విధులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 14న ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ గీజర్ లీక్ అవడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు బెంగళూరులోని సెయింట్ జాన్సన్ ఆసుపత్రిలో చేర్పించగా. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు.