తాడిపత్రి నియోజకవర్గ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు

61చూసినవారు
తాడిపత్రి నియోజకవర్గ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం 4గంటల ప్రాంతంలో ఒకసారిగా మేఘాలు కమ్ముకుని భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. అయితే గత రాత్రి 9. 2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. విత్తన సాగుకు సైతం వర్షాలు అనుకూలంగా ఉంటాయని రైతులు తెలిపారు.

ట్యాగ్స్ :