ఉరవకొండ మండలం బూదగవి గ్రామంలో సూర్యనారాయణ స్వామి ఆలయంలో భోగి పండుగ సందర్భంగా సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. అనంతరం వివిధ రకాల పూలతో సూర్య భగవానుడిని ప్రత్యేకంగా అలంకరించారు. స్వామి వారి దర్శనం కోసం చుట్టుప్రక్కల నుంచి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు, ఆశ్వీర్వచనాలు అందజేశారు.