బద్వేల్ మున్సిపాలిటీలో రోడ్డు మీదకు అక్రమ నిర్మాణాలు చేపట్టడం ద్వారా ట్రాఫిక్ కు అంతరాయం కలిగి రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని మున్సిపల్ కమిషనర్ వీవీ నరసింహారెడ్డి అన్నారు. ఈ మేరకు ఆదివారం అక్రమ నిర్మాణాలు తక్షణమే తొలగించాలని ఆదేశించారు. సీఐ రాజగోపాల్ పోలీసు సిబ్బంది ద్వారా కొన్ని తొలగించామని మిగిలిన వారు కూడా స్వచ్ఛందంగా తొలగించాలన్నారు. లేనట్లయితే మేమే తొలగిస్తామన్నారు.