వెలిగండ్ల మండలంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జియో ట్యాగింగ్ ఆఫ్ హౌస్ హోల్డ్ సర్వేల నాణ్యత లోపించిందని పలువురు ఆరోపిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి చేయాల్సిన సర్వేని పలువురు అధికారులు నిబంధనలకు విరుద్ధంగా చేస్తుండటంతో విమర్శలు వస్తున్నాయి. వలసలు వెళ్లిన వాళ్ల వివరాలు కూడా సరైన రీతిలో నమోదు చేయడం లేదని, కొన్ని పంచాయతీల్లో ఇలానే జరుగుతుందని స్థానికులు, వలసదారులు వాపోతున్నారు.