జమ్మలమడుగు మండలంలో ప్రముఖ క్షేత్రమైన శ్రీ కన్య తీర్థము నందు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి సమేత సుందరేశ్వర స్వామి ఆలయం నందు కార్తీక పౌర్ణమి సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు వివిధ రకాల అభిషేకాలు, అర్చనలు చేశారు. భారీ ఎత్తున మహిళలు తరలివచ్చి ఆలయం ఎదుట కార్తీకదీపాలను వెలిగించి తమ మొక్కలను చెల్లించుకున్నారు.