లింగాల: 14 నుంచి గ్రంథాలయ వారోత్సవాలు

77చూసినవారు
లింగాల: 14 నుంచి గ్రంథాలయ వారోత్సవాలు
లింగాల శాఖ గ్రంథాలయంలో ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను నిర్వహించనున్నట్లు మంగళవారం గ్రంథాలయాధికారి ఎస్. జయమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా పాఠశాలల విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనంతో పాటు వివిధ పోటీలను నిర్వహించి వారోత్సవాల ముగింపు రోజు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ పోటీలో పాల్గొనదలచిన విద్యార్థులు ముందుగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్