ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాం: బీటెక్ రవి

79చూసినవారు
ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామని బీటెక్ రవి పేర్కొన్నారు. శనివారం లింగాల మండలం లోపటన్నుతల గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో టీడీపి ఇన్చార్జి బీటెక్ రవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వంద రోజులకే ఇది మంచి ప్రభుత్వంగా ప్రజలతో నిరూపించుకున్నామన్నారు. త్వరలోనే ఇచ్చిన హామీలను అమలు చేస్తామని, మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్