రాత్రి పూట అనవసరంగా ఎవరూ సంచరించకూడదని, ఒకవేళ అత్యవసరమైతే గుర్తింపు పత్రాలు వెంట తెచ్చుకోవాలని పులివెందుల డిఎస్పీ మురళి నాయక్ పేర్కొన్నారు. మంగళవారం రాత్రి పులివెందుల పట్టణంలో డీఎస్పీ మురళి నాయక్ ఆధ్వర్యంలో పోలీసులు 70 మందిని పట్టుకుని పులివెందుల పోలీసుస్టేషన్లో కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దొంగతనం కేసులలో కొంత పురోగతి సాధించామన్నారు.