పులివెందుల: అభివృద్ధి ధ్యేయంగా టీడీపీ పాలన

79చూసినవారు
పులివెందుల: అభివృద్ధి ధ్యేయంగా టీడీపీ పాలన
అభివృద్ధే ధ్యేయంగా టీడీపీ పాలన సాగుతోందని రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పులివెందులలోని తన నివాసంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలు సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో సేవలందిస్తున్నారన్నారు. ప్రజల నుంచి సమస్యల అర్జీలను స్వీకరించారు. ఎమ్మెల్సీ వెంటనే సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్