వేంపల్లి: పుట్టగొడుగుల పెంపకంపై శిక్షణ

84చూసినవారు
వేంపల్లి: పుట్టగొడుగుల పెంపకంపై శిక్షణ
పుట్టగొడుగుల పెంపకంపై తమ కళాశాల విద్యార్థులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ యోగాంజనేయులు పేర్కొన్నారు. వేంపల్లిలో మంగళవారం యోగి వేమన విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ చంద్రమతి శంకర్ పర్యవేక్షణలో ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. బీపి, షుగర్ వ్యాధి గ్రస్తులకు మంచి ఆహారమని, అత్యధిక పోషక విలువలు పుట్టగొడుగుల్లో ఉన్నాయని డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి వివరించారు.