సమాజ శ్రేయస్సే లక్ష్యంగా గుడ్ నైబర్స్ ఇండియా కృషి చేయడం చాల గొప్ప విషయం అని జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారిణి రమాదేవి అన్నారు. మంగళవారం సుండుపల్లి మండలం దిగువ హరిజనవాడ లో గుడ్ నైబర్స్ ఇండియా ఆధ్వర్యంలో రూ. 35 లక్షల వ్యయం తో నిర్మించిన హెడ్ వాటర్ ట్యాంక్ తో పాటు బోరును ఆమె ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ త్రాగు నిటి సమస్యను తీర్చేందుకు వారు ముందుకు రావడం చాల అభినందనియమం అన్నారు.